ఉమ్మడి అజెండాపై మహా కూటమి ఫోకస్‌

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:31
mahakutami

అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మహాకూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టారు. ఉమ్మడి అజెండాతోనే కూటమి పార్టీలన్నీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించిన కూటమి పార్టీలు ముసాయిదాపై అంగీకారానికి వచ్చాయి. మరోసారి చర్చించి రేపే ఉమ్మడి అజెండాను ప్రకటించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశం ప్రాథమికంగా ఓ కొలిక్కి రావడంతో కూటమి పార్టీలు ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టాయి. టీకాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన కూటమి ముఖ్యనేతలు ఉమ్మడి అజెండాపై చర్చించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను పరిశీలించారు. మరోసారి సమావేశమై రేపు ఉమ్మడి అజెండాను ప్రకటిస్తామని భట్టివిక్రమార్క తెలిపారు.

కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ఆకాంక్షల అమలు కమిటీ బాధ్యతలను కోదండరాం చూసుకునేలా ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది. దాంతో టీజేఎస్‌ ప్రతిపాదించిన అనేక అంశాలపై ఉమ్మడి అజెండా మీటింగ్‌లో చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల విభజన పునః సమీక్ష, ఓపెన్‌కాస్ట్‌ విధానం రద్దు, తొలి-మలిదశ ఉద్యమకారులకు పెన్షన్‌, అమరవీరుల స్మృతివనం ఏర్పాటు, ఏడాదిలోపు లక్ష ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు ఇలా అనేక ప్రధాన అంశాలను ఉమ్మడి అజెండాలో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి అజెండా ముసాయిదాపై కూటమి పార్టీలు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో అభ్యర్ధుల ప్రకటన కంటే ముందుగా ఉమ్మడి అజెండాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

English Title
mahakutami focoused on manifesto

MORE FROM AUTHOR

RELATED ARTICLES