పొత్తు పొడవాల్సిందేనా? ఒంటరిగా ఈదే పరిస్థితి లేదా?

పొత్తు పొడవాల్సిందేనా? ఒంటరిగా ఈదే పరిస్థితి లేదా?
x
Highlights

ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. జన సమితి, సిపిఐలు..కాంగ్రెస్‌ పార్టీ వైఖరితో విసుగెత్తిపోతున్నాయి. టీడీపీ మాత్రం ఏది...

ప్రజా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. జన సమితి, సిపిఐలు..కాంగ్రెస్‌ పార్టీ వైఖరితో విసుగెత్తిపోతున్నాయి. టీడీపీ మాత్రం ఏది ఏమైనా కాంగ్రెస్ తో జట్టుకట్టాలని నిర్ణయించింది. ఒంటరి పోరుతో తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్న టీడీపీ...కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ప్రజాకూటమి ఏర్పాటు చర్చలు ముగింపు దశకు రావడం లేదు. గత కొంత కాలంగా నాలుగు పార్టీల మద్య చర్చలు సాగుతున్నా సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. కూటమి సారధ్య బాద్యతలను ఎవరికి అప్పజెప్పాలన్న అంశమే ఇంకా తేల లేదు. అలాంటప్పుడు సీట్ల పంపకాలు ఎప్పటికి ముగుస్తాయో తెలియదు. మరో వైపు కనీసం తమకు 30 సీట్లు కేటాయించాలని జనసమితి పట్టుబడుతోంది. అదే సమయంలో కనీసం 10 సీట్లు తమకు ఇవ్వాల్సిందేనని సీపీఐ డిమాండ్ చేస్తోంది. అందులో ఖచ్చితంగా హుస్నాబాద్ సీటును తమకు కేటాయించాలని కోరుతోంది. అక్కడ నుంచి సీపీఐ కార్యదర్శి చాడ వెంటకరెడ్డి పోటి చేయాలని భావిస్తున్నారు. కాని అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని చాడ తీవ్రంగా తప్పుబట్టి...తమ మంచి తనాన్ని బలహీనంగా తీసుకొవద్దని....తమ గౌరవాన్ని కించ పరిస్తే ప్రజా కూటమి నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు.

అదే సమయంలో జనసమితి అధినేత కోదండరాం సైతం ప్రజా కూటమి పై పునారాలోచన లో పడ్డారు. కోరినన్ని సీట్లు ఇవ్వడం లేదన్న కారణంతో అటు బీజేపీతో సైతం చర్చలు జరుపుతున్నారు. దీంతో ప్రజా కూటమి ఉనికే ప్రమాదంలో పడింది.అసలు కూటమి ఉంటుందా లేదా అన్నది తేలడం లేదు. అయినప్పటికీ టీడీపీ మాత్రం కాంగ్రెస్ తో జట్టు కట్టాలని నిర్ణయించింది. ఏలాంటి డిమాండ్లు ముందు పెట్టకుండా కాంగ్రెస్ తో కలిసి ప్రజా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సీట్ల సర్ధుబాటులో ఏలాంటి షరతులు పెట్టోద్దని డిసైడ్ అయ్యింది. ఎందు కంటే టీటీడీపీ ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. ఒక వేళ ఒంటరిగా బరిలోకి దిగినా గెలిచే అవకాశాలు అతి తక్కువ.

గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకున్నా టీఆర్ఎస్ ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్శ్ తో పార్టీ బలహీన పడింది. బలమైన నాయకులు పార్టీ వీడటంతో....కార్యకర్తలు డీలా పడిపోయారు. మరో వైపు గత ఎన్నికల్లో కలిసి పోటి చేసిన బీజేపీ...టీడీపీకి గుడ్ బై చెప్పింది. దీంతో ఈ ఎన్నికలు తెలుగు దేశానికి జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే పార్టీకి బతికించే కునేందుకు...సీట్లపై మొండిపట్టు పట్టకుండ...టీఆర్ఎస్ ఓటమే లక్షంగా కాంగ్రెస్ తో జట్టుకట్టాలని నిర్ణయించింది. సీపీఐ, తెలంగాణ జనసమితి చేరినా లేకపోయినా కాంగ్రెస్, టీడీపీ లతో ప్రజా కూటమి తధ్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories