కోడి కోసం రెండు రాష్ట్రాల కొట్లాట

కోడి కోసం రెండు రాష్ట్రాల కొట్లాట
x
Highlights

ఓ కోడి కోసం రెండు రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. ఆ కోడి తమదంటే తమది ఇరు రాష్ట్రాలు సిగపట్లు పడుతున్నాయి. కోడి దక్కించుకునే వరకు వెనక్కి తగ్గబోమని...

ఓ కోడి కోసం రెండు రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. ఆ కోడి తమదంటే తమది ఇరు రాష్ట్రాలు సిగపట్లు పడుతున్నాయి. కోడి దక్కించుకునే వరకు వెనక్కి తగ్గబోమని చెబుతున్నాయి. ఇంతకీ ఈ కోడి కథేంటో మీరే చూడండి.

కడక్‌నాథ్‌ కోడి.. ఇది చూడడానికి పూర్తి నల్లగా ఉన్నా, ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. కాళ్లు, రెక్కలు, ముక్కు.. ఇలా నిలువెల్లా ఈ కోడి పూర్తి నల్లగానే ఉంటుంది. మాంసం, ఎముకలే కాకుండా ఆఖరికి ఆ కోడి పెట్టే గుడ్డు కూడా కారు నలుపే. రుచితో పాటు పోషకాలు, ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయని.. కిలో ఐదువందల రూపాయిలు పలుకుతున్నా.. వీటిని కొని ఓ పట్టు పట్టడానికి మాంసాహారులు లొట్టలేస్తారు.

ఇప్పుడు ఈ నల్ల కోడి.. రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. పలు ప్రత్యేకతలున్న ఈ కోడి తమ రాష్ట్రానిదంటే.. కాదు, తమదని మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వాదిస్తున్నాయి. కడక్ నాథ్ కోడిపై భౌగోళిక గుర్తింపు తమకే ఇవ్వాలని 2012లోనే మధ్యప్రదేశ్‌ సర్కారు చెన్నైలోని జీఐ ఆఫీసుకి దరఖాస్తు చేసింది. తమ రాష్ట్రంలోని ఝబువా జిల్లాలోనే ఆ కోడి పుట్టిందని వాదించింది. అయితే, గత ఏడాది నవంబరులో ఛత్తీస్‌గఢ్‌ కూడా దరఖాస్తు చేసుకొంది. దంతెవాడలో చేపట్టిన కడక్‌నాథ్‌ కోళ్ల ఉత్పత్తి విజయవంతమైందనీ, గుర్తింపు తమకే దక్కాలనీ వాదించింది. దీంతో ఈ నల్ల కోడిపై భౌగోళిక గుర్తింపు కోసం ఇరు రాష్ట్రాల మధ్య పోటీ మొదలైంది. కడక్ నాథ్ కోడిపై జీఐ కోసం మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ లో ఏ రాష్ట్రమూ వెనక్కి తగ్గడం లేదు. రెండు ప్రభుత్వాలు, ఉభయ రాష్ట్రాల అధికారులు కూడా విజయం తమదే కావాలన్నంత పంతంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories