శ్రీరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే.. చీప్ పబ్లిసిటీ

Submitted by lakshman on Sun, 04/08/2018 - 22:24
MAA Association Press Meet Against Sri Reddy

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మీద ఆరోపణలు చేస్తూ న‌టి శ్రీరెడ్డి బట్టలిప్పి అర్దనగ్న ప్రదర్శనకు దిగిన విష‌యం తెలిసిందే. తాను ఇంతకాలంగా మొత్తుకుంటున్నా మా అసోసియేషన్ కాని, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కాని తనను పట్టించుకోవడంలేదని శ్రీరెడ్డి  ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వాపోయారు.  
 అయితే శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై మా స్పందించింది. ఎట్టి ప‌రిస్థితిలో శ్రీరెడ్డికి ” మా ” స‌భ్య‌త్వం ఇవ్వ‌బోమ‌ని ఆ సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నా మని, ఆమెతో ఎవరైనా నటిస్తే తమ సంస్థ నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.
అంతేకాదు త‌న‌ని శ్రీరెడ్డి ఘటన కలచివేసిందని అన్నారు. తమ సంస్థలో 900 మంది  సభ్యులు ఉన్నారని, కానీ ఎవరూ ఆమెతో చిత్రాల్లో నటించబోరని శివాజీ రాజా పేర్కొన్నారు. ఎన్నోవేలమంది పరిశ్రమకు వస్తున్నారు. కానీ ఎవరూ ఇలా వ్యవహరించలేదని చెప్పారు. అయినా డైర‌క్ట‌ర్ తేజ త‌న సినిమాలో అవ‌కాశం ఇస్తున్న‌ట్లు చెప్పార‌ని, మ‌రో నిర్మాత శ్రీరెడ్డికి అడ్వాన్స్ గా రూ.50వేలు కూడా ఇచ్చార‌ని సూచించారు. 
సినిమాలు చేయాల‌ని ఉద్దేశం ఉంటే ఇలా బ‌ట్ట‌లిప్పిఅర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శన చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు. త‌న‌ని క‌లిసిన సంద‌ర్భంలో ఏదైనా స‌మ‌స్య ఉంటే మేమున్నామ‌ని ధైర్యం చెప్పామ‌ని, స‌మ‌స్య‌ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్  వారికి కంప్లయింట్ ఇవ్వాలి. అలా కాకుండా సోష‌ల్ మీడియాలో చీప్ ప‌బ్లిసిటీ కోసం మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.  
ఇకపై ‘మా' తరుపున ఇన్ని మంచి పనులు జరుగుతుంటే మధ్యలో ఇలా జరుగుతుందేమిటి అనుకున్నాను. ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరెత్తినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడినా సహించేది లేదు. ఈ కమిటీ ఎన్నో మంచి పనులు చేస్తోంది. మీరు రాయి విసిరితే మేము దాన్ని తిప్పి మీ మీద విసరక పోవచ్చేమో కానీ నిజాలు చెప్పే బాధ్యత మా కమిటీకి ఉంది. అని శివాజీ రాజా అన్నారు.

English Title
MAA President Sivaji Raja Fires On Sri Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES