బస్సులు, రైళ్లు, ట్రామ్స్.. అన్నీ ఫ్రీ

Submitted by chandram on Fri, 12/07/2018 - 18:26
Luxembourg

బస్సు, రైలు, ఆటో, రైలు ఇలా చూసుకుంటూ పోతే అన్నింటికి డబ్బులు చెల్లిస్తే కాని లోపలికి అనుమతివ్వరు అని తెలిసిందే కదా అయితే గి దేశంల అయితే అన్నీ ప్రీ అటా. గిది ఎక్కడ అనుకుంటుర్రా ఎంది? లగ్జెంబర్గ అనే దేశంల ప్రజారవణాను ప్రోత్సహిస్తూ ఇటు ట్రాఫీకూ, కాలుష్యాన్ని నియంత్రించేందకే గి నిర్ణయం తీసుకుందట గి దేశం. ప్రపంచంలో గిస్మోంటి నిర్ణయం తీసుకునుట్ల తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. త్వరలోనే అధికారం పగ్గాలు చేపట్టనున్న అక్కడి సంకీర్ణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏండాకాలం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తదట. లగ్జెంబర్గ్‌లో రవాణా చార్జీలు చాలా తక్కువే. రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ చిన్న దేశంలో ప్రతి మూలకూ రెండు గంటల కంటే ఎక్కువ ప్రయాణం ఉండదట. ఈ నిర్ణయం పట్ల పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.110,000 మంది ప్రజలకు నివాసంగా ఉంది లగ్జెంబర్గ. కాని నగరంలోకి మరో 400,000 మంది ప్రయాణికులు వచ్చివెళ్తుంటారు. మొత్తం దేశంలో 600,000 మంది పౌరులు ఉండగా, ఫ్రాన్స్, బెల్జియం మరియు జర్మనీలలో నివసిస్తున్న 200,000 మంది ప్రజలు లక్సెంబర్గ్లో పనిచేయడానికి ప్రతి రోజూ సరిహద్దు దాటుతారు. 

English Title
Luxembourg to become first country to make all public transport free

MORE FROM AUTHOR

RELATED ARTICLES