పెళ్లి ప్రయత్నాలు విఫలమవడంతో పేమికుల ఆత్మహత్యాయత్నం!

Submitted by nanireddy on Sun, 06/24/2018 - 10:01
lovers-suicide-attempt-guntur-vinukonda

పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. వినుకొండకు చెందిన షహనాజ్‌, కరీముల్లా అనే యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేయమని ఇంట్లో పెద్దలను కోరారు. దీంతో ఇరుకుటుంబాల పెద్దలకు పెళ్లి ఇష్టం లేక కుదరదని చెప్పారు. ఈ క్రమంలో పెద్దమనుషులు సమక్షలో పంచాయితీ కూడా జరిపారు. కానీ వారి మధ్య చర్చలు విఫలమయ్యాయి.దీంతో మనస్థాపం చెందిన షహనాజ్‌ ఫినాయిల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వాంతులు చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన  కుటుంబసభ్యులు వెంటనే షహనాజ్‌ ను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కరీముల్లా కూడా పురుగుల మందు తాగాడు.  దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

English Title
lovers-suicide-attempt-guntur-vinukonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES