నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య.. దొరకని యువతి మృతదేహం!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 12:09
lovers-jumps-vynatheya-river

పెద్దలు తమ ప్రేమకు అడ్డుచెప్పారన్న కారణంగా ఓ యువజంట నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామ పరిధిలోని వైనతేయ వారధి వద్ద చోటుచేసుకుంది. నగరం గ్రామానికి చెందిన యెలిశెట్టి నాగశివదుర్గ (21) పదవ తరగతి పూర్తి చేసి ఎలక్ట్రీషియన్ గా స్థిరపడ్డాడు. పెదపట్నం గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముత్యాల నాగ సుజిత తొమ్మిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ  గారి ఊరైన నగరం గ్రామానికి  వచ్చింది. ఈ క్రమంలో నాగశివదుర్గ  ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ విషయం ఇరువురి ఇళ్లలో తెలిసి మందలించారు. దీంతో మనస్థాపానికి లోనైనా ప్రేమికులు వైనతేయ వారధి మీదనుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పశువుల కాపర్ల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో  నాగశివదుర్గ మృతదేహాన్ని బయటకు తీశారు. కానీ సుజిత మృతదేహం లభ్యం కాలేదు దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మత్సకారుల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. 

English Title
lovers-jumps-vynatheya-river

MORE FROM AUTHOR

RELATED ARTICLES