పెళ్ళికి ఒప్పుకొని పెద్దలు.. ప్రేమజంట ఆత్మహత్య!

Submitted by nanireddy on Sat, 05/05/2018 - 10:27
lovers commit suicide in vanaparthi

వేరు వేరు విధంగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాళ్ల గ్రామానికి చెందిన విక్రమ్, సుష్మిత లు దాదాపు మూడేళ్ళుగా ప్రేమించుకున్నట్టున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. పైగా ఇద్దరికీ వేరే సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో తాము ఇక కలిసి బ్రతకలేమనే కారణంతో మొదటగా సుష్మిత చనిపోవాలని నిశ్చయించుకుంది. దీంతో ఇంటివద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ శ్రీరాంనగర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
lovers commit suicide in vanaparthi

MORE FROM AUTHOR

RELATED ARTICLES