ఉరి వేసుకుని ప్రేమికుల ఆత్మహత్య

Submitted by nanireddy on Wed, 12/05/2018 - 21:29
love-couple-commits-suicide-tamil-nadu

కన్నవారు తమ ప్రేమను ఒప్పుకోరన్న అభిప్రాయంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన మిదింగనర్సరి (19), రోమళాప్రేమ (18). వీరిద్దరూ ఏడాది కిందట  కోయంబత్తూరు జిల్లా నెగమమ్‌ సమీపం కాట్టమ్‌పట్టి వచ్చి సమీపంలో ఉన్న కోళ్ల ఫాంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టే కన్నవారికి చెబితే.. మొదట వీరి పెళ్ళికి అడ్డు చెప్పారు. ఆ తరువాత ఇంటికి రండి వివాహం చేస్తామని చెప్పారు. కానీ వారికీ నమ్మకం కుదరక ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కన్నవారికి చెప్పకుండా ప్రేమపెళ్లిచేసుకోవడం, ఒకవేళ వారేమైనా చేస్తారేమో అన్న అభద్రతాభావం వారిని వెంటాడింది. దాంతో మనస్థాపం చెంది అదే కోళ్ల పామ్ లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
love-couple-commits-suicide-tamil-nadu

MORE FROM AUTHOR

RELATED ARTICLES