అత్యంత దూరం ప్రయాణించే రైలు!

అత్యంత దూరం ప్రయాణించే రైలు!
x
Highlights

మన దేశంలోని ఎన్నో రాష్ట్రాల మీదుగా వెళుతూ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏదో మీకు తెలుసా! మన దేశంలో..రెండు రైలు బండ్లు మాత్రమే అత్యంత దూరం...

మన దేశంలోని ఎన్నో రాష్ట్రాల మీదుగా వెళుతూ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏదో మీకు తెలుసా! మన దేశంలో..రెండు రైలు బండ్లు మాత్రమే అత్యంత దూరం ప్రయాణిస్తుంటాయి. అవి వివేక్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కాగా, రెండోది హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది ఉత్తర అస్సోంలోని డిబ్రూగఢ్ - కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4233 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి, 55 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలును స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ రైలు లుథియానా, న్యూఢిల్లీ, భోపాల్, నాగపూర్, విజయవాడ, తిరుపతి, సేలం, కోయంబత్తూరు మొదలైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంటుంది. ఈ రైలు జర్నీ 80 గంటల 15 నిమిషాల పాటు సాగుతుంది. ఇకపోతే రెండోది హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 3709 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి చేరుకునేందుకు ఈ ట్రైన్‌కు మొత్తం 71 గంటల 50 నిముషాలు పడుతుంది. ఈ రైలు మొత్తంగా 67 రైల్వే స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఈ రెండు రైళ్లు మాత్రమే దేశంలో సుదూర దూర ప్రయాణించే రైళ్లు అని ప్రసిద్ధి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories