తడిసి ఉన్నా జారిపోని సోప్

తడిసి ఉన్నా జారిపోని సోప్
x
Highlights

సోప్ అంటే జారే స్వభావం ఉంటుంది. అలాంటిది టెట్రాపాడ్‌ ఆకారంలో ఉండే సోప్ మాత్రం చేతిలో తడిసి ఉన్నా జారిపోకుండా ఉంటుంది. దీన్ని టెట్రాసోప్‌ అనే...

సోప్ అంటే జారే స్వభావం ఉంటుంది. అలాంటిది టెట్రాపాడ్‌ ఆకారంలో ఉండే సోప్ మాత్రం చేతిలో తడిసి ఉన్నా జారిపోకుండా ఉంటుంది. దీన్ని టెట్రాసోప్‌ అనే స్టార్టప్‌ తయార్డుచేసింది. ఎక్కువకాలం మన్నే లక్ష్యంతో ఈ సోప్ ను తయారుచేశారు. కొన్నేళ్ళనుంచి ఈ కంపెనీ సిలికాన్‌ అచ్చు ద్వారా ఇలాంటి ప్రత్యేకమైన సోపులు తయారు చేస్తున్నారు. ఈ సోఅనుపు కొన్ని రకాల నూనెలు, కొవ్వులతో తయారు చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటివల్ల పర్యావరణానికి నష్టమేమైనా జరిగిందా అనే వివరాలు ముద్రించి ఈ సోపును అమ్ముతున్నారు.

ఆ తరహా సోప్ ను తయారు చేసేందుకు నిధులు కావాలని టెట్రాసోపు కిక్‌స్టార్టర్‌లో అలా అడిగిందో లేదో.. దాదాపు 30 వేల హాంకాంగ్‌ డాలర్లు వచ్చేశాయి. దాంతో గతేడాది ఈ నిధులతో తయారుచేసిన సోపులను టెట్రాసోపు ప్రస్తుతం తమ వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకాలు జరుపుతోంది. అయితే ఈ సోప్ ను కేవలం చేతులు కడుక్కునేందుకు మాత్రమే తయారు చేశారు... వందగ్రాముల టెట్రాసోప్ 30 రోజులపాటు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories