ఇండోనేషియా అయ్యెను భయబ్రాంతం

Submitted by arun on Thu, 08/09/2018 - 15:22
earthquake

ఇండోనేషియాలో మరోసారి భూకంపం,

నాలుగు రోజులకే వచ్చెను తిరిగి ప్రకంపం,

ఇండోనేషియా అంత అయ్యెను భయబ్రాంతం,

చేస్తున్నారు ఇరుక్కుపోయిన వారిని తీసే ప్రయత్నం. శ్రీ.కో


ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నాలుగు రోజుల క్రితం ఇండోనేషియాలోని లాంబోక్‌ ద్వీపంలో వచ్చిన భారీ భూకంపం ఇండోనేషియాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రభావం నుంచి తేరుకోకముందే ఈరోజు ఉదయం లాంబోక్‌లో మళ్లీ భూమి కంపించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. ఆదివారం సంభవించిన భూకంపం కారణంగా కుప్పకూలిన భవనాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
 

Tags
English Title
Lombok earthquake

MORE FROM AUTHOR

RELATED ARTICLES