ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తాం: మంత్రి లోకేష్

Submitted by nanireddy on Sat, 09/15/2018 - 08:55
lokesh-connemts-on-un-employement-scheme

నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని ఏపీ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అక్టోబరు 2 నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నామని. అర్హులై.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ఈ డబ్బును ఉదోగం సంపాదించుకునేందుకు వినియోగించుకోవాలని అయన యువతను కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి అభివృద్ధి చేస్తున్నారన్నారు. గతంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్‌ చేసినా ఒక్కరు కూడా రుజువు చేయలేదన్నారు మంత్రి. కాగా వైసీపీనేతలు రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయాలని.. కుట్రలకు కాదని సూచించారు. 

English Title
lokesh-connemts-on-un-employement-scheme

MORE FROM AUTHOR

RELATED ARTICLES