పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు..

పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు..
x
Highlights

15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్ ఫుల్ నటిగా గుర్తింపు పొందిన లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహబంధంపై తనకు నమ్మకం లేదని......

15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్ ఫుల్ నటిగా గుర్తింపు పొందిన లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహబంధంపై తనకు నమ్మకం లేదని... పెళ్లి చేసుకోనంటూ ఆమె స్పష్టం చేసింది. నాకు వివాహబంధంపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని నేను అనుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. నేను చెప్పేది ఇతరులకు అర్థం అవుతుందో, కాదో తెలియదు. నేను మాత్రం తెలివిగానే చెబుతున్నాను. వివాహ జీవితంపై నాకు నమ్మకం లేదు. అందుకే నేను పెళ్లే చేసుకోను. అలాగని నాకు జీవితానికి అండ ఉండరని చెప్పడం లేదు. కచ్చితంగా ఉంటాడు. అందుకు అండ అనే మాటకు బలం, చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగించే వ్యక్తి కావాలి. దాన్ని పెళ్లి అనే మాటల్లో చేర్చడం నాకు ఇష్టం లేదు.అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పను. మరో విషయం ఏమిటంటే జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడు. అయితే నేను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పను. దాన్ని ఎలా చెప్పాలో నిజానికి నాకే తెలియదు.

Show Full Article
Print Article
Next Story
More Stories