‘లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి’

‘లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి’
x
Highlights

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్య చేశాడు. అయితే ఈ వ్యాఖ్య వెనుక ఆ అభిమాని అంతులేని అభిమానం...

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్య చేశాడు. అయితే ఈ వ్యాఖ్య వెనుక ఆ అభిమాని అంతులేని అభిమానం ఉంది.సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాను లావణ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన లావణ్య పసుపు రంగు గౌనులో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. దీనికి వరుణ్‌ అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే లావణ్య రిప్లై ఇచ్చింది. ‘హా.. హా.. మా నాన్న లాయర్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ ఫోటో, వారిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories