క్లైమాక్స్‌కు చేరిన తెలంగాణ ఎన్నికల ప్రచారం

క్లైమాక్స్‌కు చేరిన తెలంగాణ ఎన్నికల ప్రచారం
x
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. దాంతో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారంతో తెలంగాణను...

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. దాంతో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారంతో తెలంగాణను హీటెక్కిస్తున్నారు. సభలు, రోడ్‌షోలతో తక్కువ టైమ్‌లో ఎక్కువ ఏరియాలు కవర్ చేస్తున్నారు. మరోవైపు చివరి రోజు మెరుపులు మెరిపించేందుకు అగ్రనేతలు ప్రిపేర్ అవుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కి చేరింది. నెలన్నర రోజులుగా హోరాహోరీగా సాగుతోన్న ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి మైకులు బంద్‌ కానున్నాయి. ఈవినింగ్‌ ఫైవ్ తర్వాత ఎవరూ బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచారం, సందేశాలు, సర్వేలు, యాడ్స్‌ ప్రసారం చేయకూడదని సీఈవో రజత్‌కుమార్ ప్రకటించారు. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూరు‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోనైతే సాయంత్రం నాలుగు గంటలకే ప్రచార గడువు ముగుస్తుందని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచార గడువు ముగియనుండటంతో ఫైనల్ టచ్‌ ఇచ్చేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు కూడా రెడీ అవుతున్నారు. చివరి రోజు మెరుపులు మెరిపించేందుకు ప్రిపేర్ అవుతున్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ ఇప్పటికే తెలంగాణ ప్రజలనుద్దేశించి వీడియో సందేశం పంపగా, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు అశ్వారావుపేట, సత్తుపల్లి, కోదాడ నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్‌ చేయనున్నారు. ఇక బీజేపీ కూడా లాస్ట్‌ డే క్యాంపెయిన్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. మోడీ, అమిత్‌షా ప్రచారంతోపాటు ఓటర్లను ఆకట్టుకునే యాడ్స్‌తో దూసుకుపోతున్న కమలదళం చివరి రోజు మరోసారి బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. యూపీ సీఎం యోగి క్యాంపెయినింగ్ చేయనున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కి చేరింది. మరికొన్ని గంటల్లోనే ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీలు, అభ్యర్ధులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories