బీర్ బాబులకు చేదు వార్త

బీర్ బాబులకు చేదు వార్త
x
Highlights

మద్యంలో బీర్ కు ఉన్న డిమాండే వేరు. చల్లని బీర్‌ను మందు బాబులు సీసాల కొద్ది తాగేస్తుంటారు. అయితే, లారీల సమ్మె బీర్ సరఫరాపై పడింది. ఇంకా మూడు రోజులు...

మద్యంలో బీర్ కు ఉన్న డిమాండే వేరు. చల్లని బీర్‌ను మందు బాబులు సీసాల కొద్ది తాగేస్తుంటారు. అయితే, లారీల సమ్మె బీర్ సరఫరాపై పడింది. ఇంకా మూడు రోజులు సమ్మె కొనసాగితే మార్కెట్ లో బీర్ దొరకడం కష్టమవుతోంది. దేశవ్యాప్తంగా లారీల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. బీర్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. లారీల సమ్మె ఇంకా మూడు రోజుల కొనసాగితే బీర్ కరవు ఏర్పడడం ఖాయం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆరు బీరు కంపెనీలు ఉన్నాయి. 20 రకాల బీర్లను తయారు చేస్తున్నాయి. ఈ బీర్లను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని డిస్ట్రీలరీలకు సరఫరా చేస్తారు.

ఆరు బీరు కంపెనీలు రోజుకు 24 లక్షల బీర్ బాటిళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ బీర్ బాటిళ్లను లారీల ద్వారా గోదాములకు తరలిస్తారు. లారీల సమ్మె కారణంగా బీరు బాటిళ్ల సప్లయి నిలిచిపోయింది. ప్రభుత్వ ఖజానాకు రోజూ 19 కోట్ల 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ గోదాముల్లో ఉన్న బీర్ వైన్ షాపులకు సరఫరా అవుతుంది. మరో రెండు, మూడు రోజుల స్టాక్ మాత్రమే ఉంది. లారీల సమ్మె ఇలాగే కొనసాగితే గోదాముల్లో స్టాక్ ఖాళీ అయి బీర్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆశాడ మాసం లో బోనాలు, పండుగల హడావిడి ఉంటుంది. గ్రామాల్లో మొదలుకుని నగరాల వరకు మద్యానికి, ప్రత్యేకించి బీర్ కు భారీ డిమాండ్ ఉంటుంది. లారీల సమ్మె సాకుగా చూపి వైన్ షాపుల యాజమానులు మద్యం ధరలు పెంచే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories