లాహోర్ కు బస్సు యాత్రతో వాజ్ పేయి సరికొత్త చరిత్ర

లాహోర్ కు బస్సు యాత్రతో వాజ్ పేయి సరికొత్త చరిత్ర
x
Highlights

అటల్ బిహారీ వాజ్ పేయి మాటలమాంత్రికుడు, మహామనీషి మాత్రమే కాదు గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. మాటలలోనే కాదు చేతలలోనూ చాతుర్యం చూపిన భారత ప్రధానిగా కూడా...

అటల్ బిహారీ వాజ్ పేయి మాటలమాంత్రికుడు, మహామనీషి మాత్రమే కాదు గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. మాటలలోనే కాదు చేతలలోనూ చాతుర్యం చూపిన భారత ప్రధానిగా కూడా దేశప్రజలకు కలకాలం గుర్తుండి పోతారు. అణుపరీక్ష నిర్వహించిన మూడుమాసాల వ్యవధిలోనే పాకిస్థాన్ కు బస్సు యాత్ర చేయడం ద్వారా పొరుగుదేశానికి స్నేహహస్తం చాటిన చతురుడు వాజ్ పేయి.

అటల్ బిహారీ వాజ్ పేయి భారత రాజకీయాలలో నిఖార్సయిన విలక్షణ రాజకీయ వేత్త. నిండైన తన వ్యక్తిత్వంతో విమర్శకులను సైతం అభిమానులుగా శత్రువులను మిత్రులుగా మార్చుకొనే నైపుణ్యం అటల్ కు మాత్రమే సొంతం. 72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రను ఓసారి తిరగేస్తే తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకూ ఎందరు ప్రధానులు ఉన్నా విలక్షణ ప్రధాని ఎవరంటే మాత్రం అటల్ బిహారీ వాజి్ పేయి పేరు మాత్రమే ముందుగా గుర్తుకు వస్తుంది.

1999 అక్టోబర్ 13న మూడోసారి భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి ఆ తర్వాత సాహసోపేతమైన, చారిత్రక అద్భుతాలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులు, ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్ సరిహద్దుల్లోని పోఖ్రాన్ లో 1998 మే 11న విజయవంతంగా అణుపరీక్ష నిర్వహించడంలో ప్రధానిగా వాజ్ పేయి మహాసాహసమే చేశారు. దాయాది పాకిస్థాన్ గుండెల్లో గుబులు రేపడంతో పాటు దుస్సాహాసానికి పాల్పడితే భారీమూల్యం చెల్లించుకోక తప్పదంటూ పరోక్షంగా హెచ్చరించారు.

పోఖ్రాన్ అణుపరీక్షతో రగిలిపోతున్న పాకిస్థాన్ లోని లాహోర్ నగరానికి బస్సుయాత్రతో దౌత్యాన్ని నిర్వహించి స్నేహహస్తం సాచారు. భారత్ కు దురాశకానీ దురాక్రమణకానీ చేసే ఉద్దేశం లేదంటూ ప్రపంచానికి చాటారు. పాకిస్థాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపడం ద్వారా భారత్ మిత్రదేశమేకానీ శత్రుదేశం కానేకాదని చాటి చెప్పారు. ఆ తర్వాత మూడుమాసాలకే పాకిస్థాన్ నమ్మకద్రోహంతో కార్గిల్ యుద్ధానికి దిగడం భారత వీరజవానులు దీటైన సమాధానం చెప్పడం అందరికీ తెలిసిందే. ఏదిఏమైనా భారత అత్యుత్తమ, అసాధారణ రాజనీతిజ్ఞుడు, ప్రధానిగా స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి కలకాలం గుర్తుండి పోతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories