7గంటలకు లగడపాటి సర్వే ఫలితాలు

Submitted by arun on Fri, 12/07/2018 - 17:22
lp

తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ రాత్రి 7గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నారు. రాష్ట్రంలో 68.5 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైతే కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే ఆయన తెలిపారు. 2014 ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదయితే హంగ్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్‌ సరళిని బట్టే ఫలితాలు ఉంటాయని, 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారంటూ ఇటీవల లగడపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. పూర్తి సర్వే ఫలితాలను ఆయన ఈ రోజు వెల్లడిస్తానని ఇది వరకే ప్రకటించారు.
 

English Title
lagadapati press meet at 7 o'clock

MORE FROM AUTHOR

RELATED ARTICLES