వటపత్రశాయికి వరహాల లాలి !

Submitted by arun on Sat, 11/10/2018 - 16:56
Laali Laali Song

వటపత్రశాయికి వరహాల లాలి అనే లాలి పాట... మీరు వినివుంటే... తప్పక లాలి పాటల్లో..అది ఒక గొప్ప పాట అని అంగీకరిస్తారు... ఇది స్వాతి ముత్యం సినిమా కోసం సి.నారాయణ రెడ్డి రచించిన లాలి పాట. దీనిని పి.సుశీల మధురంగా గానం చేయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ పాటను రాధిక మీద చిత్రీకరించారు. ఈ రోజుకి.. ఈ పాట వింటున్న...ఎంతో మాదుర్యం వినిపిస్తుంది. 

పల్లవి :

వటపత్ర శాయికి వరహాల లాలి

రాజీవ నేత్రునికి రతనాల లాలి | | వటపత్రశాయికి | |

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి | | వటపత్రశాయికి | |


చరణం 1 :

కల్యాణ రామునికి కౌసల్య లాలి

యదువంశ విభునికి యశోద లాలి

కరిరాజ ముఖునికి గిరితనయ లాలి

పరమాంశభవునికి పరమాత్మ లాలి | | వటపత్రశాయికి | |


చరణం 2 :

అలమేలు పతికి అన్నమయ్య లాలి

కోదండరామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమనుతునికి త్యాగయ్య లాలి | | వటపత్రశాయికి | |


మీ ఇంట్లో పిల్లలు పడుకోనాప్పుడు ....ఒక్క సారి ట్రై చేసి చూడండి. శ్రీ.కో.

English Title
Laali Laali Song

MORE FROM AUTHOR

RELATED ARTICLES