కాంగ్రెస్‌లో ఆడియో టేపుల కలకలం

x
Highlights

కాంగ్రెస్‌పై అసంతృప్తులు తిరుగుబాటు చేస్తున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తూ అధిష్టానంపై ఎదురుదాడి చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్‌ క్యామ...

కాంగ్రెస్‌పై అసంతృప్తులు తిరుగుబాటు చేస్తున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తూ అధిష్టానంపై ఎదురుదాడి చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్‌ క్యామ మల్లేశ్‌ స్క్రినింగ్ ‌కమిటీ ప్రెసిడెంట్‌ భక్తచరణ్‌ దాస్‌ పై ముడుపుల ఆరోపణలు చేశారు. తాను ఇబ్రహీంపట్నం సీటు కేటాయించాలని అడిగితే భక్తచరణ్‌ దాస్‌ కుమారుడు సాగర్‌ 3 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను క్యామ మల్లేశ్‌ విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్‌లో ముడుపుల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది.

అయితే ఇదే అంశం వారం క్రితం ఢిల్లీలో కూడా కలకలం రేపింది. తుంగతుర్తి నుంచి సీటును ఆశించిన జ్ఞానసుందర్‌ అప్పట్లో భక్తచరణ్‌ దాస్‌పై ఢిల్లీలోనే ఆరోపణలు చేశారు. టికెట్‌ ఇప్పిస్తానంటూ కొంతమంది ఆశావహుల దగ్గర 3 కోట్ల చొప్పున వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటుందని వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్ దాస్ ఖండించారు. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని తన వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారిపైనే దర్యాప్తు జరపాలని ఎదురుదాడి చేశారు. అయితే తాజాగా భక్తచరణ్‌ దాస్‌ కుమారుడు సాగర్‌ క్యామ మల్లేశ్‌ను డబ్బులు అడుగుతున్నట్లుగా ఉన్న ఆడియో టేపులు వెలుగుచూడటంతో కాంగ్రెస్‌ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories