కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

Submitted by arun on Thu, 01/11/2018 - 13:20
YSRCP

వైసీపీ అధినేత జగన్‌ దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు సై అంటూ కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హఫీజ్‌ఖాన్‌ను ఖరారు చేస్తున్నట్లు ఆ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి బుధవారం ప్రకటించారు. నగరంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు తమ నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో నియోజకవర్గంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు జిల్లాల అధ్యక్షులతో పాటు నాయకులు, కార్యకర్తలు హఫీజ్‌ఖాన్‌ గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.

English Title
kurnool mla ycp candidate

MORE FROM AUTHOR

RELATED ARTICLES