కర్నాటక ము‌ఖ్యమంత్రిగా ఇవాళ కుమారస్వామి ప్రమాణస్వీకారం

కర్నాటక ము‌ఖ్యమంత్రిగా ఇవాళ కుమారస్వామి ప్రమాణస్వీకారం
x
Highlights

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరు విధానసౌధ ఎదురుగా ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు....

కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరు విధానసౌధ ఎదురుగా ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కుమారస్వామితోపాటు కర్నాటక టీపీసీసీ చీఫ్‌ పరమేశ్వర.... డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి సోనియా, రాహుల్‌తోపాటు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.

మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్‌–జేడీఎస్‌ మధ్య అంగీకారం కుదిరింది. మొత్తం 34 మంత్రి పదవులకు గాను కాంగ్రెస్‌కు 22 సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. ఉపముఖ్యమంత్రి పదవి కర్నాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి.పరమేశ్వరను వరించింది. అలాగే స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్‌ జేడీఎస్‌కు దక్కనున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలపరీక్ష ముగించుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్‌ ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించడం తన జీవితంలోనే పెద్ద సవాల్‌ అన్నారు కుమారస్వామి.

Show Full Article
Print Article
Next Story
More Stories