ప్రణయ్ హత్యపై స్పందించిన కేటీఆర్

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 17:44
ktr-tweet-pranay-honour-killing-murder

 సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో దారుణ హత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ పై పలువురు సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రణయ్ హత్యపై కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా అయన భార్య అమృతకు సానుభూతి తెలియజేశారు కేటీఆర్.. 'ప్రణయ్‌ దారుణ హత్య తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. సమాజంలో కులతత్వం ఇంత బలంగా నాటుకుపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షపడుతుంది. బాధిత కుటంబానికి న్యాయం లభిస్తుంది. ప్రణయ్‌ భార్య అమృత గారికి, అతని తల్లితండ్రులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

English Title
ktr-tweet-pranay-honour-killing-murder

MORE FROM AUTHOR

RELATED ARTICLES