రూ.23వేల‌కోట్ల‌తో హైద‌రాబాద్ అభివృద్ధి

Submitted by arun on Wed, 01/03/2018 - 20:55


హైద‌రాబాద్ ను రూ23వేల కోట్ల‌తో అభివృద్ధి చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. అయ్య‌ప్ప సొసైటీ చౌర‌స్తాలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)  అండర్ పాస్‌ను  కేటీఆర్ ప్రారంభించారు. .త్వ‌ర‌లో 110 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ ఆర్ డీసీప ప‌థ‌కం కింద రూ.3,200కోట్ల అభివృద్ధి జ‌రుగుతున్నాయ‌ని..మ‌రో 3వేల‌కోట్ల‌కు  అభివృద్ధి పనులకు టెండర్లు పిలవబోతున్నామని ప్రకటించారు.రూ.3,200కోట్ల నిధుల‌తో మైండ్‌స్పేస్ జంక్షన్‌లో ఫ్లైఓవ‌ర్ ,కామినేని జంక్షన్ ఫ్లై ఓవర్, చింతలకుంట అండర్‌పాస్ నిర్మాణం, అంబర్‌పేట ఫ్లై ఓవర్ ,  వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం పరిశీలనలో ఉందన్నారు. హైదరాబాద్‌లోని రోడ్లను యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేస్తున్నామని స్పష్టం చేశారు. వర్షం వచ్చిన రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీతో 950 కోట్ల రూపాయాలతో రోడ్ల నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

English Title
KTR Speech at Under Pass SRDP Project Inauguration

MORE FROM AUTHOR

RELATED ARTICLES