‘కృష్ణార్జున యుద్ధం’ ట్విట్టర్ రివ్యూ: దిల్ రాజు చెప్పిందే నిజమైంది

Submitted by arun on Thu, 04/12/2018 - 10:42
kk

న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో టాలీవడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని వరుసగా 8 హిట్స్ సొంతం చేసుకున్నాడు. నాని తాజాగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మరియు ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిట్ చిత్రాలని రూపొందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ గురువారం నాడు (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ముందే చూసిన దిల్ రాజు ఫస్టాఫ్ ఎంటర్ టైన్‌మెంట్‌తో బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం కొద్దిగా తగ్గిందని అయితే ఓవరాల్‌గా మాత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ప్రేక్షకులు మెచ్చే చిత్రం అవుతుందని అన్నారు. అయితే థియేటర్స్‌లో నాని బొమ్మపడిన తరువాత ఈ తరహా కామెంట్స్ ఎక్కువగా వస్తుండటంతో దిల్ రాజు నిజమే చెప్పాడంటున్నారు సినీ జనాలు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్టాప్ పర్లేదు కాని.. సెకండాఫ్ బోర్ కొట్టించాడంటూ ట్విట్టర్‌లో వరస ట్వీట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. 

ఫస్టాప్‌లో కృష్ణ, అర్జున్‌గా రెండు విభిన్నపాత్రల్లో నాని తన స్థాయి నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడని, నాని స్టైల్ ఆప్.. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌టైన్ చేశాడని అంటున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ టేకింగ్ పరంగా ఓకే అనిపించినా కథను ఆసక్తిగా మలచడంలో తడబడ్డాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అనుపరమేశ్వరన్ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుందని, మరో హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ తన పరిధి మేరకు బాగానే నటించిందంటున్నారు. ఓవరాల్‌గా ‘కృష్ణార్జున యుద్ధం’ యుద్ధం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదన్నది ట్విట్టర్ పిట్ట కూతను బట్టి అర్థమౌతోంది. 

English Title
krishnarjuna yudham audience review and public review rating

MORE FROM AUTHOR

RELATED ARTICLES