తానే ముఖ్య‌మంత్రిన‌న్న జ‌గ‌న్ పై కోటా కామెంట్స్

Submitted by lakshman on Tue, 01/09/2018 - 00:17

విల‌క్ష‌ణ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు ఓ ఇంట‌ర్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర  వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గురించి, బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ హ‌వాపై మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా బీజేపీకి, గౌర‌వం ఉన్నాయ‌ని కొనియాడారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోమ‌రాజు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఆయ‌న.. పార్టీలో లీడర్లుగా ఉన్నవాళ్లకు న‌మ్మ‌కం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ..అందుకే కాబోలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ముఖ్య‌మంత్రిని అని జ‌గ‌న్ అన‌ట్లేదా అని ప్ర‌శ్నించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేరు. బీజేపీకి దాని స్థానం దానికి పదిలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం మాత్రం బీజేపీకి కష్టమే’ అని అన్నారు. 
 

English Title
kota srinivasa rao satire on ys jagan

MORE FROM AUTHOR

RELATED ARTICLES