ఆయన ఓ చీడపురుగు...ఆయన వల్లే మాకు టిక్కెట్‌ రాలేదు : కొండా మురళి

Submitted by arun on Tue, 09/25/2018 - 13:32

టీఆర్ఎస్‌లో అగ్రకులానికే ప్రాధాన్యత ఇస్తున్నారని.. కొండా మురళి ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓ చీడపురుగని.. ఆయన వల్లే తమకు టిక్కెట్‌ రాలేదన్నారు. తాము బీసీలమనే తమను పక్కన పెట్టారన్నారు. బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని, ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబంతో తమకు 30 ఏళ్ల వైరం ఉందని అన్నారు. దయాకర్‌రావు కంటే ముందే కొండా సురేఖ మంత్రి పదవి నిర్వహించారని గుర్తుచేశారు. సురేఖకు ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చే బాధ్యత తనదని అన్నారు.
 

English Title
Konda Murali Fires on TRS

MORE FROM AUTHOR

RELATED ARTICLES