పోతూపోతూ హరీష్‌ బాంబ్ పేల్చిన కొండా దంపతులు

x
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితిలో హారీష్ రావు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు, లేదా ఆయన పేరు చెప్పి, కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో...

తెలంగాణ రాష్ట్ర సమితిలో హారీష్ రావు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు, లేదా ఆయన పేరు చెప్పి, కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్తూవెళ్తూ కొండా దంపతులు పేల్చిన హరీష్‌ బాంబు, గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలింతకూ హరీష్ కేంద్రంగా ఎందుకిలా జరుగుతోంది?

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నుంచి కేసీఆర్‌తో కలిపి పనిచేస్తున్న మంత్రి హారీష్ రావుకు, పార్టీలో మంచి పేరుంది. పార్టీలో కష్టించి పనిచేసే వ్యక్తిగా, పార్టీ అధినేత కేసీఆర్ ఏ పని అప్పగించినా విజయవంతంగా చేస్తారని పేరు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ది. అయితే కొద్ది రోజులుగా హారీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని పార్టీలో అయన మాట చెల్లుబాటు కావడం లేదనే ప్రచారం సాగుతోంది. దీనిపై హరీష్ రావు పదే పేద వివరణ ఇచ్చుకున్న ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

మొన్నటికి మొన్న కొంగరకలాన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ఆద్యంతం హరీష్ రావు ఎక్కడా కన్పించలేదు. ఆటైంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. అడ్కడ పెద్ద పెద్ద మెటార్ల డ్రై రన్లో పాల్గొన్నారు. అయితే సభలో సీఎం ప్రసంగం టైంలో, జనాన్ని చూసిన నేతలు, హరీష్ రావు పాత్ర లేకపోవడంతో ఇంత పేలవంగా జరిగిందని, లేకుంటే సభ సక్సెస్ ఫుల్‌గా, బాగా జరిగేదని ప్రచారం చేశారు. దీన్ని ప్రతిపక్షాలు ఓ అస్త్రంగా వాడుకున్నాయి.

కొంగర కలాన్ సభ ముగిసిన వెంటనే హుస్నాబాద్‌లో 7వ తేదీన ప్రజాఆశీర్వాద సభ పేరుతో, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు కేసీఆర్. అయితే ఆ సభను ఆద్యంతం హరీష్ రావు దగ్గరుండి పర్యవేక్షించి విజయవంతం చేశారు. దీంతో పార్టీలో అంతర్గత పోరు ఉత్తదే అని ప్రచారం సాగింది. సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెల్లిన హరీష్ రావు, తన దత్తత గ్రామం ఇబ్రహీం నగర్‌లో ప్రజలను చూసి ఇంత ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లోంచి తప్పుకుంటే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.

ఈ వ్యాఖ్యల మరుసటి రోజే, ప్రతిపక్షాలు హరీష్‌ అస్త్రాన్ని మరోసారి టీఆర్ఎస్‌పై ప్రయోగించాయి. కావాలనే హరీష్ రావు ప్రాధాన్యాన్ని కేసీఆర్ తగ్గిస్తున్నారని, తన కుమారుని ఎలివేషన్‌ కోసం, హరీష్‌ను డౌన్‌ చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు, ప్రచారం చేశారు. సిద్దిపేట నియోజక వర్గం నుంచి హరీష్ రావు కాకుండా ఈసారి సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారని కూడా ఆరోపించారు.

ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్తున్న కొండా దంపతులు, పోతూపోతూ మరో బాంబు పేల్చారు. పార్టీలో తాము హరీష్ రావు వర్గంగా ఉన్నందునే ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వుకుండా కేటీఆర్, కవితలు అఢ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రచారం జరిగిన ప్రతీసారి హరీష్ రావు వివరణ ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని తాను పార్టీ మారే ఆలోచన లేదని కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తానంటున్నారు హరీష్. తన కేంద్రంగా వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని తిప్పికొడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories