క‌త్తి మ‌హేష్ ప్రెస్ మీట్ పై కోన్ వెంక‌ట్ ట్వీట్

Submitted by arun on Mon, 01/08/2018 - 11:17

ప‌వ‌న్ కల్యాణ్ - క‌త్తిమ‌హేష్ ల మ‌ధ్య వివాదం తారాస్థాయికి చేరింది. నిన్న‌ ప్రెస్ మీట్ లో క‌త్తి మ‌హేష్..పూన‌మ్ కౌర్, కోన వెంక‌ట్ , త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇన్నాళ్లు పవన్ స్పందిస్తే చాలు అనుకున్న ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని అంటున్నారు. అయితే ప్రెస్ మీట్ అనంత‌రం ప‌లు ఛాన‌ళ్ల‌లో లైవ్ డిస్క‌ష‌న్స్ లో పాల్గొన్నారు. లైవ్ డిస్క‌ష‌న్స్ లో కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు - మ‌హేష్ క‌త్తి ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన కోన వెంక‌ట్ స‌యోధ్య కుదుర్చుతాన‌ని ట్వీట్ చేశారు. ఈ వివాదంపై దయచేసి 15వ తారీఖు వరకు సైలెంట్ గా ఉండమని అన్నారు. మౌనం ఎప్పటికి మోసం చేయదు అన్న కొటేషన్ తో పాటు కత్తి మహేష్ తో పాటుగా అభిమానులు మౌనం వహించాలని కోరుకున్నారు. ముఖ్యంగా కత్తి మహేష్ కూడా ఏ మీడియా హౌజ్ కు వెళ్లి అభిమానులను, పవన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ట్వీట్ చేశారు. అలా చేస్తే సయోధ్య కుదుర్చాలన్న తన ప్రయత్నం ఫలించినట్టే అని అన్నారు.

అయితే 15 తర్వాత కోనా వెంకట్ ఏం చేయబోతున్నారు..? పవన్ కత్తి మహేష్ గొడవకు ఎలా ఫుల్ స్టాప్ పెడతాడు అన్న విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. కోనా వెంకట్ ఈ ట్వీట్ కు పవన్ అభిమానుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. మరి కనీసం కోనా కోరిక మేరకు 15 దాకా అయినా కత్తి సైలెంట్ గా ఉంటాడా లేక మళ్లీ ఏదైనా చర్చకు దారి తీస్తాడా అన్నది వేచి చూడాలి. 

English Title
kona venkat tweet mahesh kathi

MORE FROM AUTHOR

RELATED ARTICLES