కోన వెంకట్ నన్ను శ్మశానం వెనక్కి రమ్మన్నాడు: శ్రీరెడ్డి

Submitted by arun on Thu, 04/12/2018 - 11:09
kona

ఇప్పటివరకూ పలువురిపై ఆరోపణలు చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు ఆధారాలను బైట పెట్టడం ప్రారంభించింది. మా అసోసియేషన్ ఆఫీస్ ముందు అర్ధ నగ్న నిరసన చేయడం.. నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయట పెట్టడం.. వంటివి చేసిన తరువాత సడెన్ ఈమె గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. నేషనల్ ఛానళ్లలో కూడా ఈమె ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయి.

తను తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఛానల్ లోనే.. మరోసారి లైవ్ షోలో పాల్గొన్న శ్రీరెడ్డి.. ఇప్పుడు కోన వెంకట్ కూడా తనను లోబరచుకున్నాడని చెప్పింది. ‘‘కోన వెంకట్‌కు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనకాల ఒక గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడు రాత్రి 9 అయింది. నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత వి.వి.వినాయక్ కూడా ఇక్కడికే వస్తుంటాడు మేము ఇక్కడే సిట్టింగ్‌లు వేస్తాం. వస్తాడు కాసేపట్లో పరిచయం చేస్తాను అని పిలిచాడు. ఆడపిల్లలం. మాకు ఆశ ఉండదా? మేము కూడా వర్క్ చేసుకోవాలనే కదా వెళతాం. వాళ్ల చేతుల కింద నలిగిపోయి.. వాళ్లు వేశ్యలకు మల్లే నాలుగు డబ్బులు చేతిలో పెడితే తినాలనుకుంటామా? ఆశ ఉండదా మాకు? వర్క్ ప్లేస్‌లో బోనస్ రావాలని అనుకోమా? ప్రమోషన్ రావాలని అనుకోమా? మీరు చేసేది న్యాయమైతే అర్ధరాత్రి.. అపరాత్రి కడుపు కట్టుకుని.. క్యాబ్‌‌లెక్కో.. లేదంటే ఓన్ కార్లు వేసుకునో వెళతాం. ఆశపడటం తప్పైతే ప్రపంచంలో ప్రతివాడూ ఏ ఆశ లేకుండా బతకాలి. సన్యాసుల్లా బతకాలి’’
 
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘కోన వెంకట్ దగ్గరకు వెళ్లాను. తాగుతావా? అంటే నాకు తాగుడు అలవాటు లేదు అన్నాను. నన్ను శారీరకంగా బలవంతం చేశాడు కోన వెంకట్. నేను నిరూపిస్తా. ఇప్పటికీ ఆధారాలున్నాయి. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు అని చాలా మంది మాట్లాడారు. ఇపుడు ఆధారాలు చూపిస్తే జీర్ణించుకోలేరు. ఆమె ఇష్టమయ్యే వెళ్లింది కదా.. ఆమె నవ్వుతుంది కదా. నా ఆవేదన నా కడుపు ఉడికిపోవడం నాకు తెలుసు. నా కుటుంబానికి తెలుసు. ఎంతమంది చేతుల్లో నలిగిపోవాలి?’’ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది శ్రీరెడ్డి.
 

English Title
Kona Venkat Forced Me For Exploit Sri Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES