'మంత్రి పదవి ఆఫర్‌ చేశారు.. ఫుటేజీ బయటపెడతా'

Submitted by arun on Thu, 02/08/2018 - 14:24
Komatireddy venkatreddy

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్న మంత్రి కేటీఆర్ సవాల్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఉత్తమ్‌తో మాట్లాడానని కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉత్తమ్‌తోపాటు తానూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ చేతగానితనం వల్లే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.

మరోవైపు 'టీఆర్‌ఎస్‌ తలుపులు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారు' అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఆఫీస్‌కు వచ్చి మంత్రి పదవి ఇస్తానని కేటీఆర్‌ ఆఫర్‌ చేశారని.. కావాలంటే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెడతానని కోమటిరెడ్డి తెలిపారు.

English Title
komatireddy venkat reddy fires ktr 

MORE FROM AUTHOR

RELATED ARTICLES