నా బంధువులు చాలు కేసీఆర్ ను ఓడించ‌డానికి

Submitted by arun on Mon, 03/12/2018 - 12:45

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగాన్ని కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై హెడ్‌సెట్‌, మైక్‌ విసరటానికి ముందు కోమటిరెడ్డి హెచ్‌ఎంటీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. అధిష్టానం ఆదేశిస్తే... సీఎం సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోనే ర్యాలీని విజయవంతం చేసిన తనను ప్రభుత్వం నన్ను టార్గెట్‌ చేసిందన్నారు. తనను బలిపశువును చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎంను గజ్వేల్‌ నియోజవర్గంలో ఓడించడానికి తన బంధువులు చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అసెంబ్లీలో స్వామిగౌడ్‌పై కోమటిరెడ్డి హెడ్‌సెట్‌, మైక్‌ విసిరిన ఘటనపై సర్కార్‌ సీరియస్‌ అయింది. రేపు అసెంబ్లీలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దాడికి గల కారణాలను కోమటిరెడ్డి హెచ్ఎంటీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా పంచుకున్నారు. ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలిపాలనుకున్నామన్నారు కోమటిరెడ్డి. అయితే గవర్నర్‌ ప్రసంగంలో రైతుల విషయం, పంటకు గిట్టుబాటు ధర విషయం గురించి ప్రస్తావన లేకపోవడంతో అన్నదాత తరుపున ఆవేదన తెలియచేయాలనుకున్నామన్నారు కోమటిరెడ్డి. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నాదాతలను గాలికొదిలేసిందని మండిపడ్డారు కోమటిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న సర్కార్‌కు త్వరలోనే కాలం ముగుస్తుందన్నారు. సబ్సిడీల రూపంలో వేల కోట్లు రూపాయలను మాయం చేశారన్న కోమటిరెడ్డి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పార్లమెంట్‌లో రైతుల సమస్యలపై మాట్లాడటం లేదని చెప్పారు. గతంలో గవర్నర్‌ను కొట్టేందుకు హరీశ్‌రావు చైర్‌ ఎక్కారు గతంలో వారు చేసిన ఆందోళనను మర్చిపోయి మాపై మహిళ మార్షల్స్‌ను ఉసిగొల్పడం దారుణమన్నారు.

English Title
Komatireddy Venkat Reddy Face To Face Over His Behavior In TS Assembly

MORE FROM AUTHOR

RELATED ARTICLES