పార్టీ మరో ఐదేళ్లు నష్టపోతుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted by nanireddy on Fri, 09/21/2018 - 19:54
komatireddy rajagopalreddy responds on shocause notices

రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులుజారీ చేసింది క్రమశిక్షణ కమిటీ. ఇక ఈ నోటీసులపై స్పందించారు రాజగోపాల్ రెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలను సూచనగా తీసుకోవాలని.. నిజమైన కార్యకర్తలకు కాకుండా ఎవరికో పదవులు వస్తుంటే ఎలా ఊరుకుంటామని అయన ప్రశ్నించారు. గెలిచే అభ్యర్థులను కాదని వేరెవరికో టికెట్లు ఎలా ఇస్తారు. పార్టీని వీడిన వారి పేర్లు కూడా పీసీసీ నూతన కమిటీలో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గాంధీభవన్ లో కూర్చొని షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని అన్నారు. పార్టీకోసం ఎంతో కష్టపడ్డాం.. మాలాంటి కార్యకర్తలను గుర్తించాలనేదే నా అభిమతం. నాలాంటి నాయకుడిని వదులుకుంటే పార్టీకే నష్టం.. కార్యకర్తల ఆవేదన చెప్పుకోకపోతే పార్టీ మరో ఐదేళ్లు నష్టపోతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్అధికారంలోకి రావడానికి కృషి చేస్తా.. అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పూర్తి విశ్వాసం ఉంది. అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.  

English Title
komatireddy rajagopalreddy responds on shocause notices

MORE FROM AUTHOR

RELATED ARTICLES