ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే.. నేను పోటీ చేయను..!

Submitted by chandram on Fri, 11/09/2018 - 17:39
Rajagopala reddy

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ టికెట్ కోసం చిరుమూర్తి లింగయ్యకే కేటాయించాలని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ పట్టుపడుతున్నారు. లింగయ్యకు టికెట్ ఇవ్వని పక్షంలో మునుగోడు పోటి నుండి తప్పుకుంటా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుండి పోటీ నుండి తప్పుకుంటడని రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్కసీటు కేటాయిస్తామని కుంతియా ప్రకటనతో ఈ గందరగోళం మొదలైందన్నారు. గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ టికెట్లు కేటాఇస్తుందని అన్నారు. భక్త చరణ్‌దాస్‌ టికెట్లు అమ్ముకుంటున్నారనే ప్రచారంలో నిజం లేదని, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌, ఓయూ జేఏసీ నేత మానవత రాయ్‌కు టికెట్లు ఇవ్వనున్నారని రాజగోపాల్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎప్పటికైనా కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని  స్పష్టం చేశారు.
 

English Title
komatireddy rajagopal reddy supports to chirumaruthi lingaiah

MORE FROM AUTHOR

RELATED ARTICLES