‘కోహ్లీ.. నన్ను పెళ్లి చేసుకోవా’

‘కోహ్లీ.. నన్ను పెళ్లి చేసుకోవా’
x
Highlights

లాహోర్: టీమిండియా ఆటగాళ్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని టక్కున సమాధానమొస్తుంది. కోహ్లీకి ఇండియాతో పాటు పాకిస్తాన్‌లో కూడా...

లాహోర్: టీమిండియా ఆటగాళ్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని టక్కున సమాధానమొస్తుంది. కోహ్లీకి ఇండియాతో పాటు పాకిస్తాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కోహ్లీకి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కోహ్లీకి అక్కడ అభిమానులుండటానికి ఒక కారణం కావచ్చు. పాక్‌లో కోహ్లీ క్రేజ్ ఎంతలా ఉందంటే మగాళ్లు కూడా పెళ్లి అభ్యర్థన పంపేంత. ఇండిపెండెన్స్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లెవరూ లేరు. ధోనీ, కోహ్లీ వంటి ఉన్నత శ్రేణి ఆటగాళ్లు జట్టులో సిరీస్‌లో ఆడకపోవడం అక్కడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది. కొందరు మిస్ యూ ధోనీ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే.. మరికొందరు మిస్ యూ కోహ్లీ అని ప్లకార్డులు పట్టుకుని టీమిండియా ఆటగాళ్లపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ పాకిస్తాన్‌లో ఓ పోలీసాయన చేసిన పని ఆశ్చర్యాన్ని కలిగించింది.

కోహ్లీకి అమ్మాయిలు పెళ్లి ప్రపోజల్స్ పంపించడం సహజం. కానీ పాకిస్తాన్ పోలీస్ తనను పెళ్లి చేసుకోమంటూ కోహ్లీకి పెళ్లి అభ్యర్థనను పంపుతున్నట్లు ఉన్న ప్లకార్డును పట్టుకోవడంతో అభిమానులు అవాక్కయ్యారు. ప్రేమ ఉండొచ్చు కానీ మరీ పెళ్లి చేసుకునేంత ప్రేమేంట్రా బాబోయ్ అని పాకిస్తాన్ పోలీసుపై క్రికెట్ అభిమానులు పంచ్‌లేస్తున్నారు. అయితే ఇది నిజంగా అతను తెచ్చిన ప్లకార్డేనా.. లేక ఎవరైనా అమ్మాయిలు తెస్తే.. పట్టుకున్నాడా అనే సందేహం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. వైరల్ చేయడం కోసమే ఇదంతా అని.. మరీ ఇంత అతి పనికిరాదని కొట్టిపారేస్తున్న వారూ ఉన్నారు. 2014లో కోహ్లీ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ కూడా ప్రపోజల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కోహ్లీ తన వాడేనని అనుష్క శర్మ ఫిక్సయినట్లుందని కొందరు నెటిజన్లు సరదగా కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories