కాంగ్రెస్‌లోకి కిరణ్ రీ ఎంట్రీ...రాహుల్ సమక్షంలో నేడు చేరిక

Submitted by arun on Fri, 07/13/2018 - 10:38
kr

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కిరణ్‌ ఈ ఉదయం పదకొండున్నరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పలువురు కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజించాలన్న కాంగ్రెస్‌ అధిష్ఠాన నిర్ణయంతో విభేదించిన కిరణ్‌ 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది మార్చి 12న జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించిన కిరణ్ ఆ ఎన్నికల తర్వాత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఏడాది క్రితం రాహుల్‌ గాంధీతో ఆయన ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలంటే రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కిరణ్‌ తన అభిప్రాయాలను రాహుల్‌తో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో కిరణ్‌ కుమార్‌ రెడ్డిని పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ కలిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో పాటు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లూ చేశారు. దీంతో కిరణ్ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. 

English Title
Kiran Kumar Reddy To Return To Congress, Will Meet Rahul Gandhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES