బలవంతపు పెళ్లి.. అబ్బాయిని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసిన అమ్మాయి తరఫువాళ్లు

Submitted by arun on Sat, 01/06/2018 - 13:07
Kidnapped and Forced to Marry

ఇప్పటివరకు అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి.. పెళ్లి చేసుకున్న ఘటనలే చూశాం. కానీ.. బీహార్‌లో సీన్ రివర్స్ అయ్యింది. అబ్బాయిని.. అమ్మాయి తరఫు వాళ్లు బలవంతంగా ఎత్తుకెళ్లి.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి మరీ పెళ్లికూతురికి తాళి కట్టించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపాడు. 

పెళ్లి జరుగుతున్నంత సేపు.. కొందరు మహిళలు ఎందుకు ఏడుస్తున్నావ్.. మేమేమి నిన్ను ఉరి తీయడం లేదు.. పెళ్లి మాత్రమే చేస్తున్నాం కదా అన్నారట. పెళ్లి కూతురు తరఫు వాళ్లు.. తనను బలవంతంగా  తీసుకెళ్లారని.. తాను కేవలం.. అమ్మాయి జుట్టు తప్ప ఇంకేమీ చూడలేదని కంప్లైంట్‌లో తెలిపాడు పెళ్లికొడుకు వినోద్. ఆమెవరో కూడా నాకు తెలియదు.. కావాలంటే.. పెళ్లి వీడియోలలో నేను బాధపడుతున్నట్లు ఉంటుంది చూడండి అని ఫిర్యాదులో తెలిపాడు వినోద్.

ఇక వరుడు వినోద్‌ కుమార్‌.. బొకారో స్టీల్‌ ప్లాంట్లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల మొకమా గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరైన వినోద్‌ను అమ్మాయి తరఫు బంధువైన సంజయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి.. ఈ పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి కూతురు తరఫువాళ్లు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. అబ్బాయికి అమ్మాయి ముందే తెలుసని, కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, అందుకే ఇలా బలవంతంగా వివాహం జరిపించాల్సి వచ్చిందని తెలిపారు. రెండు వర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
 

English Title
Kidnapped and Forced to Marry, Bihar Engineer Now Seeks Police Protection

MORE FROM AUTHOR

RELATED ARTICLES