కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Submitted by arun on Thu, 12/06/2018 - 17:01
kia

ఏపీని పర్యావరణ హితమైన రాష్ర్టంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాలుష్యం తగ్గించే వాహనాల ప్రోత్సహానికి ఏపీ ప్రభుత్వం కియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రూపాయిన్నరకే యూనిట్ సౌర విద్యుత్ లభించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఏపీ సీఎం.

కాలుష్యం తగ్గించే వాహనాల ప్రోత్సాహానికి ఏపీ ప్రభుత్వం కియా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగ్యస్వామ్యం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు, కియా మోటర్స్ సీఈవో షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అమరావతి సచివాలయంలో కియా కార్లు, ఛార్జింగ్‌ స్టేషన్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

కియా మోటార్స్ ఏపీ ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చిన అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను చంద్రబాబు టెస్ట్ డ్రైవ్ చేసి పరిశీలించారు. కియా కారు సౌకర్యవంతంగా ఉన్నాయని అన్నారు. ఇక్కడ తయారైన కియా కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని, 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు చంద్రబాబు. పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు, కియా సంస్థ ప్రతినిధులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

English Title
Kia Motors signs MoU with AP to drive eco mobility

MORE FROM AUTHOR

RELATED ARTICLES