కాంగ్రెస్‌లో పెరుగుతున్న నిరసనలు...రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వడంపై...

Submitted by arun on Fri, 11/09/2018 - 14:57

ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగానే రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు నిరనసలకు దిగారు. గాంధీ భవన్ ఎదుట ఖానాపూర్‌ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన దిగారు. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న తమ  నేత అజ్మీరా హరి నాయక్‌కు టికెట్ ఎందుకు కేటాయించలేదంటూ కార్యకర్తలు నిరసనకు దిగారు. రమేష్ రాథోడ్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. 

English Title
Khanapur Congress Activists Protest at Gandhi Bhavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES