కేరళలో కుండపోత వర్షం

Submitted by arun on Thu, 08/09/2018 - 15:10
Kerala rains

కేరళలో కురిసేను బహు భారీ వర్షాలు,

వరద నీటితో నిండెను ఎన్నో జలాశయాలు,

స్తంభించిపోయాయి రవాణా వ్యవస్థలు,

సెలవులు ప్రకటించారు ఇక  విద్యాసంస్థలు. శ్రీ.కో

కేరళను భారీ వర్షాలు పడుతున్నాయి. జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ కూడా  స్తంభించిపోయింది. దాదాపు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు వర్షాల ధాటికి 18 మంది మృతి చెందారు. అధికారిక సమాచారం ప్రకారం కొండ చరియలు విరిగిపడి ఇడుక్కిలో 10 మంది, మలప్పురం ఐదుగురు, కన్నూర్‌లో ఇద్దరు, వైనాడ్‌లో ఒక్కరు చనిపోయారు. వైనాడ్, కోజికోడ్, పాలక్కాడ్ జిల్లాల్లో ఒకరేసి గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

English Title
Kerala rains

MORE FROM AUTHOR

RELATED ARTICLES