కేరళ కోలుకుంటున్న వేళ!

కేరళ కోలుకుంటున్న వేళ!
x
Highlights

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ, అత్యవసర సర్వీసులను ప్రారంబించల్సిన వేళ , దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను రిపేర్లు చేయాల్సిన నేల, అంటువ్యాధులు...

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ,

అత్యవసర సర్వీసులను ప్రారంబించల్సిన వేళ ,

దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను రిపేర్లు చేయాల్సిన నేల,

అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తిసుకుంటున్నారు చాల. శ్రీ.కో.


వరద విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రంలో అత్యవసర సర్వీసులను పునరుద్ధరించేందుకు సర్కారు చర్యలు తీసుకోంటోంది. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేపడుతున్నారు. విద్యుత్, టెలికం సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి రవి అధికారులను ఆదేశించారు. కేరళలో 10వేల కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు కొచ్చి విమానాశ్రయం వరదనీటిలో మునగడంతో భారీ నష్టం వాటిల్లింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యఆరోగ్య బృందాలను రంగంలోకి దించారు. మందులను కూడా సరఫరా చేశారు. వరదనీటి వల్ల ఇళ్లలో ఎంతో బురద పేరుకుపోయింది. దీంతోపాటు ఇళ్లల్లోని టీవీ వంటి ఎలోక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. వరద తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను తొలగించే పనులను మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories