జైల్లో చిప్ప‌కూడుతిన్న శ్రీమంతుడు

x
Highlights

నాలుగ్గోడల మధ్య బందీ ఏడు చువ్వల వెనకాతలే జీవితం బయట ప్రపంచంతో సంబంధం ఉండదు.. అయిన వాళ్లను కలిసే అవకాశం ఉండదు.. పెట్టింది తినాలి.. చెప్పింది చేయాలి.....

నాలుగ్గోడల మధ్య బందీ ఏడు చువ్వల వెనకాతలే జీవితం బయట ప్రపంచంతో సంబంధం ఉండదు.. అయిన వాళ్లను కలిసే అవకాశం ఉండదు.. పెట్టింది తినాలి.. చెప్పింది చేయాలి.. నేరం చేసిన వారు జైలుకెళ్తారు. కానీ, ఇప్పుడు ఎలాంటి తప్పు చేయని వారు కూడా సంగారెడ్డి జైలుకు క్యూ కడుతున్నారు. పక్క రాష్ట్రాల నుండే కాదు, విదేశీయులు కూడా ఇక్కడ జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇంతకీ సంగారెడ్డి జైలులో నయా ఖైదీల సంగతేంటో మీరే చూడండి. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు సంగారెడ్డి జైలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పలువురు అత్సాహికులు కేరాఫ్ ఎడ్రాస్ గా నిలిచింది.. ‎

జైలు జీవితం అంటే.. నేరస్తుల పాలిట శాపం. నేరస్తులకు శిక్ష. చిన్నా చితకా నేరాలు మొదలు ఎంతటి ఘోరాలు చేసినా న్యాయస్థానాల్లో విధించిన శిక్షను అనుభవించే చోటే జైలు. జైలుకు వెళ్లిన ఖైదీలకు అదో విభిన్న ప్రపంచం. అక్కడి నియమాలు, నిబంధనలు బయటి ప్రపంచపు జీవనానికి ఏ మాత్రం సంబంధం ఉండదు తినాలన్నా, నిద్రపోవాలన్నా అంతా నిబంధనల ప్రకారం జరగాల్సిందే.. ఉల్లాసానికి, విలాసాని దూరంగా, స్వేచ్ఛకు, సరదాలకు సంబంధం లేకుండా నేరస్థులు జీవించాల్సి వుంటుంది.

దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ ఇప్పుడు సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని అది కూడా ఏ తప్పూ చేయకుండానే అనుభవించ వచ్చు. ఇటీవల తెలంగాణ జైళ్లశాఖ ఈ వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. జైల్లో ఖైదీలను ఎలా చూస్తారు.. వాళ్లకెలాంటి ఆహారం అందిస్తారు. బందిఖానాలో ఉన్నప్పుడు వారి దినచర్యలేంటి..? ఇలా.. మొత్తానికి జైలు జీవితం రుచి చూపించేందుకు అవకాశాన్ని కల్పించింది.

ఇటీవల సంగారెడ్డి జైల్ మ్యూజియంలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే వారు ఒక్కరోజు జైలు జీవితం గడపవచ్చని, అందుకుగాను 500 చెల్లించాల్సి ఉంటుంది.. ఈ వినూత్న కార్యక్రమానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది.. గత వారం ఇద్దరు మలేషియా దేశస్తులు రెండు రోజుల జైలులో ఖైదీ జీవితం అనుభవించగా, తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన చెమ్మనూర్ ఇంటర్ నేషనల్ జ్యూవలర్స్ సంస్ధ చైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ బాబీ.. తన ముగ్గురు మిత్రులు తో కలిసి 24 గంటల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు.

బాబీ చెమ్మనుర్ కేవలం వ్యాపార వేత్తగానే కాకుండా.. 812 కిలోమీటర్ల మేర మారథాన్లలో పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాడు.. ఈ యన కేరళలో పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించాడు.. ఈ బడా పారిశ్రామిక వేత్త జైలు లో ఖైదీగా చెమ్మనూర్ జైలు పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు చెట్లకు నీళ్లు పట్టారు. జైల్లో జరుగుతున్న పనులకోసం ఇసుక బస్తా మోసారు. తనకు మొదటి సారిగా పదిహేను సంవత్సరాల వయస్సప్పుడు జైలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరిక కలిగిందని, కాని జైలు అధికారులు అనుమతి బాబీ చెమ్మనూర్ చెప్పారు ప్రతి రోజు లగ్జరీ జీవితం అనుభవించే తమకు ఖైదీగా అనుభవం ఉండాలని అనిపించేదని ఆ కోరిక ఇన్నాళ్లకు తీర్చుకున్నానని ఆయన వివరిచారు. మొత్తానికి జైలు జీవితం అనుభవించాలనుకునే వారెవరైనా డబ్బులు చెల్లిస్తే చాలా జైలు జీవితం పరిచితమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకూ ఇలాంటి కోరిక ఉంటే వెంటనే జైలుకెళ్లండి ఒక్క రోజు ఖైదీ అవ్వండి.

Show Full Article
Print Article
Next Story
More Stories