వారు అంగీకరిస్తే ప్రేమ వివాహాం చేసుకుంటా : కీర్తి సురేష్

Submitted by nanireddy on Mon, 05/21/2018 - 08:54
keerthy-suresh-reaction-mahanati-movie-success

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో అచ్చం సావిత్రిలాగా ఒదిగిపోయింది నటి కీర్తి సురేష్. సావిత్రిలా ఆమె చేసిన నటనకు యావత్ తెలుగు తమిళ సినీలోకం ఫిదా అయింది. మొదట్లో కలెక్షన్ల పరంగా కాస్త స్లోగా నడిచిన మహానటి ఒక్కసారిగా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మరింత ఊపందుకున్నాయి. దీంతో సినిమా యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. దీనిపై కీర్తి సురేష్ తన ఆనందాన్ని తెలియజేస్తూ..  సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది మహానటి చిత్రం ద్వారా సావిత్రి గారి జీవిత చరిత్రను ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు..  ఈ చిత్రంలో తాను నటించిన తరువాత చాలా విషయాలను తెలుసుకున్నాను. దాంతో పాటు సావిత్రి నిజజీవితంలో ఎలా ఉటుందన్న నిజాన్ని మహానటి సినిమాద్వారా తెలిసిందని దాంతో తాను చాల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఇక ప్రేమపెళ్లి విషయమై స్పందించిన కీర్తి నేను ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో నాకు ఎవరిపైన అయినా ప్రేమపుడితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటాను. అని ప్రేమపెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

English Title
keerthy-suresh-reaction-mahanati-movie-success

MORE FROM AUTHOR

RELATED ARTICLES