సిద్ధిపేట నుంచి కేసీఆర్.. హుస్నాబాద్ నుంచి హరీష్??

Submitted by arun on Mon, 03/12/2018 - 11:40
trs

టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు.. ఊహలకు అందకుండా పరుగులు పెడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా.. ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు అయిన సీనియర్ నాయకుడు హరీష్ రావు.. 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్లబోతున్నట్టుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం సంచలనమైంది. ఆఖరికి.. స్వయంగా హరీష్ రావే.. మీడియా ముందుకు వచ్చి.. తన పుట్టుకా.. చావూ టీఆర్ఎస్ తోనే అని చెప్పుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఇలాంటిదే.. మరో ప్రచారం సిద్ధిపేట కేంద్రంగా జరుగుతోంది. ఈ సారి గజ్వేల్ నుంచి కాకుండా.. తన పాత కోట సిద్ధిపేట నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుందా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. హరీష్ రావును హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్టుగా.. సిద్ధిపేట ప్రజల నుంచి సమాచారం అందుతోంది. ఈ విషయంలో.. పార్టీ నుంచి ఎలాంటి లీకులు లేకపోయినప్పటికీ.. నేరుగా సిద్ధిపేట ప్రజలే ఇలా మాట్లాడుకుంటుండడం.. చర్చనీయాంశమవుతోంది.

ఇదే జరిగితే.. టీఆర్ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యతపై మరోసారి చర్చ మొదలవుతుంది. కానీ.. సిద్ధిపేటను అభివృద్ధి చేసినట్టే.. హుస్నాబాద్ కూ హరీష్ రావు అవసరం ఉందని కేసీఆర్ చెబితే.. ఎవరూ అడ్డుపడకపోవచ్చు. పైగా.. అధినేత ఎక్కడ పోటీ చేయాలని ఆదేశించినా.. తాను శిరసావహిస్తానని హరీష్ కూడా స్పష్టం చేశారు. దీంతో.. ఈ సారి సిద్ధిపేట కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయం.. మరింత రంజుగా మారే అవకాశమైతే.. ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తోంది.

English Title
KCR's strategies over Harish Rao continues

MORE FROM AUTHOR

RELATED ARTICLES