కేటీఆర్, చెన్నమనేని రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి..

Submitted by arun on Tue, 11/20/2018 - 17:35
kcr

తెలంగాణలో రాబోయే రోజుల్లో కోటి ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా తెలంగాణ వ్యాప్తంగా ఆహార శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఇందులో IKP మహిళా సంఘాల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. IKP మహిళా సంఘాల్లో పని చేసే వారిని శాశ్వాత ఉద్యోగులుగా మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆహార శుద్ది కేంద్రాల వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు..కల్తీ లేని ఆహార పదార్థాలు ప్రజలకు లభిస్తాయని ముఖ్యమంత్రి వివరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాదాయం బాగా పెరిగిందని సిరిసిల్ల సభలో కేసీఆర్ అన్నారు. ఇసుక అమ్మకం ద్వారా 10 ఏళ్ళ కాంగ్రెస్ హయాంలో 9 కోట్ల 56 లక్షల ఆదాయం వస్తే నాలుగున్నరేళ్ళ టీఆర్ఎస్ పాలనలో 2 వేల 57 కోట్ల ఆదాయం వచ్చిందని టీఆర్ఎస్ అధినేత వివరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం ద్వారా భారీ ఆదాయం తెచ్చిన ఘనత గనుల శాఖా మంత్రి కేటీఆర్‌దేనని గులాబీ బాస్ అన్నారు. ఇసుక ఆదాయం గురించి తాను చెప్పిన లెక్కలు నిజమైతేనే సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కేటీఆర్, చెన్నమనేని రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

English Title
KCR In TRS Sircilla Praja Ashirvada Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES