నేను చచ్చేలోపు రైతులు ధనవంతులు కావాలి: కేసీఆర్‌

నేను చచ్చేలోపు రైతులు ధనవంతులు కావాలి: కేసీఆర్‌
x
Highlights

నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ...

నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ తాను చనిపోయేలోపు తెలంగాణలో ఉన్న అందరూ రైతులు ధనవంతులు కావాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇష్టమోచ్చినట్లు అరవడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని కెసిఆర్ విమర్శించారు. ఎన్నికల అంటేనే మాటల గారడి ఎవరో వచ్చి ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెబుతారు అయినా మీరు ఆగం కావద్దని కెసిఆర్ ప్రజలకు సూచించారు. ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటుండు కాని వచ్చే సంవత్సరం అసలు ఆయన అధికారంలో ఉంటే కదా అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికిపైగా సీట్లు గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మేమే నాలుగున్నర ఏండ్లు పాలిస్తేనే మామీద ఒర్రుతుర్రు మరీ మీరు 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు వర్తింప జేస్తామన్నారు. నిజమాబాద్‌ రూరల్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను లక్షమెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories