చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లడుగుతారు : కేసీఆర్

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లడుగుతారు : కేసీఆర్
x
Highlights

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణలో వేసిన పునాది రాళ్ళతో ఓ ప్రాజెక్టు కట్టొచ్చని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాను 9 ఏళ్ళు...

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణలో వేసిన పునాది రాళ్ళతో ఓ ప్రాజెక్టు కట్టొచ్చని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాను 9 ఏళ్ళు దత్తత తీసుకున్న చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని జడ్చర్ల ఎన్నికల ప్రచార సభలో నిలదీశారు. పాలమూరును వలస జిల్లాగా మార్చిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన చంద్రబాబు మళ్ళీ మహా కూటమి పేరుతో తెలంగాణలో ప్రవేశించడానికి యత్నిస్తున్నారని అలాంటి వారిని ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు తగ్గాయని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ళలోనే పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని తద్వారా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. పాలమూరు అభివృద్ధి పధంలో పయనిస్తున్న కారణంగా ముంబై బస్సులు బంద్ అయ్యాయని వలస వెళ్ళిన వారు తిరిగి వస్తున్నారని అన్నారు. పాలమూరు వలసల్ని ఆపిన టీఆర్ఎస్‌ పార్టీని మళ్ళీ గెలిపించాలని జడ్చర్ల బహిరంగ సభలో కేసీఆర్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories