దేశంలోనే సువర్ణ అధ్యాయానికి శ్రీకారం- సీఎం కేసీఆర్

Submitted by santosh on Thu, 05/10/2018 - 13:01
kcr huzurabad

భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజురాబాద్‌లో రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకే దక్కిందన్నారు. రైతులకు ఇచ్చే డబ్బు బ్యాంక్‌లో ఉంది. రైతులకు ఇచ్చే డబ్బు రూ.6 వేల కోట్లు బ్యాంకులో ఉన్నాయని సీఎం చెప్పారు. పాస్‌బుక్కులు, చెక్కులు అందించడానికి కృషి చేసిన అధికారులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రైతు పెట్టుబడి కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాం. బంగారు పంటలు పండించాలని రైతులను కోరుతున్నారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి.. నీళ్లుండాలి.. కరెంట్ ఉండాలని సీఎం అన్నారు. నేడు యావత్‌దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

English Title
kcr huzurabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES