ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై దుమారం

x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుభకాంక్షలు అంటూ ఏపీలో వెలుస్తున్న ప్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. కొన్ని చోట్ల కేసీఆర్, జగన్ ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే,...

తెలంగాణ సీఎం కేసీఆర్ కు శుభకాంక్షలు అంటూ ఏపీలో వెలుస్తున్న ప్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. కొన్ని చోట్ల కేసీఆర్, జగన్ ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, మరో చోట కేసీఆర్, పవన్ ల ఫ్లెక్సీ కట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో మిఠాయిలు పంచి బాణసంచా కాల్చారు. టీఆర్ ఎస్ విజయోత్సవాలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం సాధిస్తే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు మద్దతుగా ఫ్లెక్సీలు కట్టడం కలకలం రేపుతోంది. నరసాపురం బస్టాండ్‌ సెంటర్‌లో కేసీఆర్ బాహుబలి అంటూ వైసీపీ అభిమానులు ఫ్లెక్సీని కట్టారు. రాత్రి వెలిసిన ఈ ఫ్లెక్సీ తెల్లవారుజామునే మాయం కావడంపై దుమారం రేగుతుంది.

గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్‌, యూపీలో మాయావతి గెలిచినప్పుడు నర్సాపురంలో వారి అభిమానులు శుభకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టారు. అప్పట్లో ఆ ఫ్లెక్సీలను ఎవరూ తొలగించలేదు. ఇప్పుడు కేసీఆర్‌ ఫ్లెక్సీని తీసివేయడంపై విచారణ జరుగుతోంది. లకోడేరు మండలం కుమదవల్లి గ్రామంలో కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఫోటోలతో వైసీపీ అభిమానులు ఫ్లెక్సీ కట్టారు. ఈ ఫ్లెక్సీని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉండిలో వైసీపీ సమన్వయకర్త నరసింహరాజు కారు లాంటి కేక్ ను కట్ చేసి, మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చి వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తణుకు నియోజకవర్గంలోని పైడిపర్రులో జనసేన అధినేత పవన్ ఫోటోతో కేసీఆర్ కు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాలకొల్లులో కొందరు టీఆర్ ఎస్ జెండాలతో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తెలంగాణలో ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ కు ఏం సంబంధం అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories